
ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
ఉట్నూర్, నవంబర్ 15 : ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన యోధుడు, స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన బిర్సాముండాను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బిర్సాముండా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీవో మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సర్పంచ్ భూమన్న పాల్గొన్నారు.
నార్నూర్, నవంబర్ 15 : బిర్సాముండా ఆశయాలను కొనసాగించాలని సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మడావి మాన్కు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్‌లో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించారు. బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మానిక్రావ్, మండలాధ్యక్షుడు కనక ప్రభాకర్, ఎంపల్లి ఉపసర్పంచ్ మడావి పైకు, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నాయకులు శ్రీరామ్, రాయిసిడాం ఏత్మారావ్, హైమద్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 15 : మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్ ఆవరణలో ఆదివాసీ సంఘం నాయకులు బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి మండలాధ్యక్షుడు ఆత్రం మహేందర్, నాయకులు విఠల్, సిడాం మురళీకృష్ణ, శ్రీకాంత్, భరత్, మల్లేశ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 15 : మండల కేంద్రంలోని రాధాకృష్ణ మందిర ఆవరణలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆదివాసీ వీరుడు బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కనక తుకారాం, ఆర్కా ఖమ్ము, మరప రాజు, మారుతిపటేల్, రాజలింగు, సుంకట్రావ్, గోపాల్‌సింగ్, దిలీప్మోరే, దేవ్‌పూజే మారుతి, లింగంపల్లి గంగన్న, భీంరావ్, విజయ్‌సింగ్, చందర్‌సింగ్, నారాయణ, రాజేశ్వర్ పాల్గొన్నారు.