కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ( Orient Cement Company ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు ( Recognition elections) శుక్రవారం ఉండగా ఎన్నికల నేపధ్యంలో దేవాపూర్‌లో భారీగా పోలీసులను మోహరించారు (Police deployed ) . బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది చేరుకొని పోలీస్ మార్చ్ నిర్వహించారు.
ప్రధాన యూనియన్లు రెండింటి మద్య తీవ్ర పోటీ నేపధ్యంలో ఇటీవల ఘర్షణలు జరిగిన క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 150 మంది పోలీసులను రంగంలోకి దింపి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కంపెనీ ఆవరణలతో పాటు దేవాపూర్ కు వచ్చి పోయే రహదార్ల వెంట సైతం పోలీసులను మోహరించారు.
ఆగస్టు 29న ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 266 ఓట్లు ఉన్నారు. దీనిలో 257 మంది నేరుగా ఓట్లు వేయనుండగా 9 మంది సీల్డ్ కవర్ ఓటింగ్ వేయనున్నారు. ముందుగా 266 మంది ఓట్లు కాగా ట్రైనీలని అభ్యంతరాలు రావడంతో కార్మిక శాఖ 9 మందిని తొలగించి 257 మంది ఓట్లను చేశారు.
తొలగించిన వారు తమకు ఓటు హక్కు ఉందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపై కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు. దీనిపై యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో పలు సూచనలు చేస్తూ ఎన్నికలు నిర్వహించి 9 మందికి సీల్డ్ కవర్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.