
బోథ్, డిసెంబర్ 14: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం మండలంలోని సొనాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బస్టాండ్ ఎదుట పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు, జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్, ఐటీడీఏ డైరెక్టర్ భూమన్న, కో ఆప్షన్ సభ్యుడు మహమూద్, సర్పంచ్ సదానందం, నాయకులు సదానందం, అమృత్‌రావు రాందాస్, నరేందర్, ప్రకాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి సన్మానం
ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన దండె విఠల్‌ను బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతతో పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్లకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు జుగదిరావు, మణింధర్సింగ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఎం రాజేశ్వర్, మహిపాల్, కొడప విజయ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీని కలిసిన నాయకులు
ఇచ్చోడ/ తలమడుగు/ ఉట్నూర్/గుడిహత్నూర్, డిసెంబర్ 14: ఇచ్చోడ, తలమడుగు, ఉట్నూర్, గుడిహత్నూర్ మండల టీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీగా గెలుపొందిన దండె విఠల్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఇక్కడ ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు సుభాష్, ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఇచ్చోడ మండల ఉపాధ్యక్షుడు ముస్తాఫా, అల్తాఫ్, తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ ఎల్మ శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ జీవన్‌రెడ్డి, టీఎన్ శాస్త్రీ, ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్‌ఎంపీపీ దావులే బాలాజీ, గుడిహత్నూర్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బ్రహ్మానంద్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, ఏఎంసీ వైస్‌చైర్మన్ జంగు, ఎంపీటీసీ శగీర్ఖాన్, న్యాను, నాయకులు రాజేశ్వర్, జలంధర్ ఉన్నారు.
ఉట్నూర్, డిసెంబర్ 14: ఎమ్మెల్సీగా గెలుపొందిన దండె విఠల్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ సతీశ్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.