
భైంసా, డిసెంబర్14 : రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎప్పటికప్పుడు తరలించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. పట్టణంలోని లక్ష్మీ నర్సింహ, దేగాంలోని ఆదిత్య రైస్‌మిల్‌ను అదనపు కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ విశ్వంభర్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
లోకేశ్వరం, డిసెంబర్ 14 : ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అదనపు కలెక్టర్ రాంబాబు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మండలంలోని బిలోలి, పుస్పూర్లోని కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్‌మిల్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి తరలించాలని చెప్పా రు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, నాయబ్ తహసీల్దార్ అశోక్ ఉన్నారు.