
ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు విడుదల చేసిన బీసీ సంక్షేమశాఖ
46314 మంది విద్యార్థులకు ప్రయోజనం
నిర్మల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు, ఉపకార వేతనాలను విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికిగాను ఉమ్మడి జిల్లాకు మొత్తం రూ. 29,97,78, 000విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆయా జిల్లాలకు ఆర్డర్ కాపీలు పంపిం చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పాలిటెక్నిక్, బీటెక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ చదువుతున్న విద్యార్థులకు ప్రయో జనం చేకూరనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 46,314 మందికి ఈ నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ విద్యను గాడిలో పెట్టి, విద్యార్థులకు చేయూత నందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ, ఈబీసీ లకు ఫీజు రియంబర్స్మెంట్, మెస్ చార్జీల కింద ఈ నిధులను విడుదల చేసింది. దీతో తల్లి దండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యజమాన్యాలు, విద్యార్థుల ఆర్టీఎఫ్ ఆధారం గానే విద్యను కొనసాగిస్తున్నది. దీంతో నిధులు విడు దల కావడంతో వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపో నున్నాయి. మెస్ చార్జీల కింద రూ.1646.88 లక్షలు విడుదల కాగా.. ఆర్టీఎఫ్ కింద రూ. 133 330లక్షలు, ఈబీసీ విద్యార్థులకు రూ. 17.64 లక్షలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులకు ప్రయోజనం…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి గాను మెస్ చార్జీలు, ఆర్టీఎఫ్, ఈబీసీ విద్యార్థులకు మొత్తం రూ. 30కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. కరోనా నేప థ్యంలో విద్యా సంస్థలు ఇటీవల తెరుచుకోవడంతో చదువుకుంటున్న విద్యార్థులకు చేయూతనందిం చాలన్న ఉద్దేశంతో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు విడుదల చేసింది.
రాజలింగం, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, నిర్మల్