
ముగిసిన న్యాయ విజ్ఞాన సదస్సులు
ఆదిలాబాద్ అదనపు జడ్జి శ్రీనివాసరావు
ఆయా చోట్ల జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీలు
ఎదులాపురం, నవంబర్ 14 : డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ద్వారా ప్రజలందరికీ ఉచితంగా న్యాయసాయం అందిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా అదనపు జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రభాత్ భేరీ(ర్యాలీ)ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోర్టు నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడి యం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు జడ్జి మా ట్లాడుతూ.. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఆదివారం నాటితో ముగిసినట్లు చెప్పారు. డీఎల్ఎస్ఏ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌భాస్కర్‌రావు, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ మంజుల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రమణా రెడ్డి, పీపీలు, న్యాయవాదులు, కోర్టు ఎస్సీసీ సిబ్బంది పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..
ఉట్నూర్, నవంబర్14 : రాజ్యాంగంలోని చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ అన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై మండల న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అక్కాల రాజమణి, ఎక్సైజ్ సీఐ మంగమ్మ, ఎస్ఐ రాములు, న్యాయవాదులు ధీరజ్ గుప్తా, పెందూర్ ప్రభాకర్, జైవంత్‌రావు, తిరుపతి, సిబ్బంది అబిద్ పాల్గొన్నారు.
బోథ్‌లో ర్యాలీ..
బోథ్, నవంబర్ 14 : గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తామని బోథ్ కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. బోథ్‌లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్‌రావు దేశ్పాం డే, కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు మోహన్‌రావు, ఆడెపు హరీశ్‌కుమార్, కుమ్మరి విజయ్, ఎస్ఐ రాజు, కట్టా భూ మేశ్, మాసం అనిల్, సోలంకి సాయి, ముత్యం పాల్గొన్నారు.
నిర్మల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు..
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 14 : నిర్మల్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ హరీశ మాట్లాడారు. 14 ఏళ్ల బాలబాలికలకు ప్రత్యేక నిర్బంధ విద్యాహక్కు చట్టం ఉన్నదన్నారు. మహిళలు, బాలబాలికలకు ప్రత్యేక చట్టాలు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.