
ఇంద్రవెల్లి, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటునందిస్తున్నాయని ఇంద్రవెల్లి పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే అన్నారు. ఇంద్రవెల్లి పీఏసీఎస్‌లో ఆదివారం సహకార వారోత్సవాలు నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహకార సంఘ వారోత్సవాలు ఈ నెల 20 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పంటల సాగుపై సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రైతులతో పాటు సహకార సంఘాల అభివృద్ధికి సభ్యులు, రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుమ్ర కేశవ్‌రావ్, మాజీ చైర్మన్ దిలీప్ మోరే, డైరెక్టర్లు జైస్వాల్ దిలీప్, అధికారులు ధరంసింగ్, తుమ్మల సునీల్ కుమార్, సురేశ్ పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 14: సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని బోథ్ పీఏసీఎస్ కదం ప్రశాంత్ పిలుపు నిచ్చారు. బోథ్‌లోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆదివారం సహకార జెండాను ఎగురవేశారు. సంఘం ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న రుణాలు, ఇతర సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోల రాజేశ్వర్, సీఈవో బదుగు స్వామి, నర్సయ్య, ప్రవీణ్, దేవిదాస్, ప్రవీణ్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, నవంబర్14 : మండలకేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ మేకల వెంకన్న సహకార జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహకార సంఘం ద్వారా రైతులకు అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం లో సీఈవో నారాయణగౌడ్, డైరెక్టర్లు రాజేందర్, దేవ్‌రావు, లింగన్న, నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 14 : నేరడిగొండ, కుమారి పీఏసీఎస్‌లలో సహకా ర సంఘ వారోత్సవాలు నిర్వహించారు. ఆయా సంఘాల్లో చైర్మన్లు సాబ్లే కిశోర్ సింగ్, మందుల రమేశ్ సహకార జెండాలను ఎగురవేశారు. సహకార సంఘాలు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నాయన్నారు. సంఘాల బలోపేతానికి రైతులు కృషి చేయాలని కోరారు. అనంతరం జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నీలేశ్, భూమన్న, రాజారాం, లక్ష్మి, బాదన్న, సీఈవోలు నాగభూషణ్, ప్రవీణ్, సిబ్బంది గంగన్న, భూమారెడ్డి, రాజు, సంతోష్, రాజేందర్, రైతులు ప్రభాకర్, భోజన్న, రాజేశ్వర్, రవి, గంగన్న పాల్గొన్నారు.
గుడిహత్నూర్,నవంబర్ 14: మండల కేంద్రం లోని పీఏసీఎస్‌లో చైర్మన్ సంజీవ్ కుమార్ ముండె సహకార జెండా ఎగురవేశారు. కార్యక్ర మం లో సీఈవో పండరీ,సంఘ సభ్యులు ఫడ్ దిలీప్, సంగ ఆశన్న యాదవ్, ధన్‌రాజ్,సిబ్బంది కిషన్, న్యానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.