
ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ,
ప్రధాన కార్యదర్శి సాయిబాబు
మంచిర్యాలటౌన్, నవంబర్ 14: కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ అమైండ్మెండ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడి, విద్యుత్ రం గాన్ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామ ని ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రా ష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు పేర్కొన్నారు. సంఘానికి రాష్ట్ర బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురిని మంచిర్యాల డివిజన్, స ర్కిల్ ఉద్యోగులు ఆదివారం మంచిర్యాలలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011లో ఉద్యోగాలు సాధించిన వారి కి ఏరియర్స్ ఇప్పిస్తామని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇప్పిస్తామని, ఎన్ఎంఆర్, సోషల్ వర్కర్స్కు అదనంగా జీతం ఇప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. ఆలిండియా ఎలక్ట్రీసిటి ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ కమి టీ ఉపాధ్యక్షుడు ఎన్ పద్మారెడ్డి, రా్రష్ట్ర సలహాదారు జనార్దన్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధీర్, అదనపు కార్యద ర్శి శంకర్, ఎన్పీడీసీఎల్, డిస్కం అధ్యక్షుడు ర ఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్ ఎస్ఈలు రమేశ్‌బాబు, జడ్ ఉత్తం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొండయ్య, డివిజన్ అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి, కార్యదర్శి రాజన్న పాల్గొన్నారు.