
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రికులకు వీడ్కోలు
ఎదులాపురం, సెప్టెంబర్ 13 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్‌యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఆ కాంక్షించారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం నుంచి సోమవారం సైకిల్ యాత్రను జెండా ఊపి ఆయ న పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సైకిల్ నడుపుతూ జాతీయ సరిహద్దు వరకు కలిసి వీడ్కోలు పలికా రు. అనంతరం ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజల్లో సమైక్యతాభావం, ఐక్యమత్యాన్ని పెంపొందించే దిశలో సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్ర జిల్లా ప్రజల్లో నూతన ఉ త్సాహం కలిగించిందన్నారు. మహారాష్ట్ర సరిహద్దు వరకు జిల్లా ప్రజలు ఘనమైన స్వాగతం పలుకుతూ జాతీయ సమైక్యతపై నినాదాలు చేస్తూ ఉత్సాహంగా సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రికుల వెంట ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అ నంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ బలగాల గురించి సాధారణ ప్రజలకు తెలిసిందేనన్నారు. మొదటిసారిగా దేశ ప్రజలకు జాతి ఐ కమత్యంపై స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేయ డం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సీ సమయ్ జాన్‌రావు, బీ వినోద్ కుమా ర్, టీఎస్ఎస్పీ కమాండెంట్ ఆర్ వేణుగోపాల్ , డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణమూర్తి, రిజర్వ్ సీఐ ఓ సుధాకర్‌రావు, గడికొప్పుల వేణు, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దినేశ్‌కుమార్ సింగ్, సీఐ గంగాధర్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
దివంగత పోలీసు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాథోడ్ వికాస్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందాడు. సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో కానిస్టేబు ల్ కుటుంబసభ్యులను ఆహ్వానించి, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హై దరాబాద్ పోలీసు భద్రత కార్యాలయం నుంచి మంజూరైన రూ.4 లక్షల చెక్కును కుటుంబ స భ్యులకు ఎస్పీ అందజేశారు. కానిస్టేబుల్ భార్య కరుణకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం పరిపాలనాధికారి మహ్మద్ యూ నుస్ అలీ, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఎస్పీ కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, తదితరులు పాల్గొన్నారు.