
లక్ష్యానికి చేరువలో టీకా ప్రక్రియ
మొదటి డోసు 97.24 శాతం
రెండో డోసు 43.83 శాతం
ఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేసేందుకు కసరత్తు
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక శ్రద్ధ
అర్హులందరూ వేసుకునేలా అవగాహన
వైద్యశాఖ కొవిడ్-19 టీకా ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నది. జిల్లా వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన 5,36,109 మందిని గుర్తించగా, 5,21,363 మందికి మొదటి డోసు వేసి 97.24 శాతం పూర్తి చేసింది. ఇక 2,28,557 మందికి రెండో డోసు వేసి 43.83 శాతం పూర్తి చేసింది. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కలెక్టర్ భారతీ హోళికేరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. – మంచిర్యాల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల, డిసెంబర్ 12, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా 918 వైద్య సిబ్బందితో పాటు మున్సిపాలిటీల్లోని ఆర్పీలు, అంగన్వా డీ టీచర్లు, వీఆర్ఏలు, వీఆర్వోల సహకారం తో టీకా ప్రక్రియ వేగవంతం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 121, మున్సిపాలిటీల్లో 174 వ్యా క్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీకా వేసుకోని వారి కోసం జల్లెడ పడుతున్నారు. రెండో డోసు గడువు పూర్తయిన వారి వివరాలు సేకరించి, వ్యాక్సిన్ వేసేలా కృషి చే స్తున్నారు. మంచిర్యాలలో రెండు, బెల్లంపల్లి, చెన్నూర్‌లో ఒక్కో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లోనూ టీకా వేస్తున్నారు. కలెక్టర్ భారతీ హోళికేరీ జిల్లాలో తనిఖీల తో పా టు వందశా తం పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బందిని అప్రమత్తం చే స్తుండడంతో పాటు డోసు వేసుకోని వారి తో ప్రత్యక్షం గా మాట్లాడి టీకా ఆవశ్యకతను వివరిస్తున్నారు. బుధవారం బెల్లంపల్లి మండలంలోని బు ధాకుర్ము గ్రామం లో వ్యాక్సినేషన్ వివరాలను స్థానిక సి బ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు వ్యాక్సినేషన్ తీసుకోని వా రితో స్వ యంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆలస్యమై తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, వ్యా క్సిన్ వేసుకునేందుకు ఆలస్యం చేయవద్దని హె చ్చరిస్తూ టీకా తీసుకునేలా ప్రోత్సహించారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో ..
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 41,104 మంది వ్యాక్సినేషన్‌కు అర్హులుగా గుర్తించారు. 34 బృందాలను ఏర్పాటు చేసి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 20 వేల లోపు మందికే టీకాలు పూర్తి చేశారు. బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల పీహెచ్సీ పరిధిలో మొదటి డోసు 98.61 శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాసిపేట మండలంలో 22,573 మందికి 22 వేల మందికి టీకాలు వేసి 99 శాతం పూర్తి చేశారు. భీమిని, కన్నెపల్లి మండలాల పరిధిలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
మంచిర్యాల నియోజకవర్గంలో..
మంచిర్యాల మున్సిపాలిటీలో 18 ఏండ్లు నిం డినవారు 72,500 మంది ఉండగా, 93 శాతం మొదటి డోసు పూర్తయ్యింది. మండలంలో 99.4 శాతం పూర్తి చేసుకొని చివరి దశ కు చేరుకుంది. లక్షెట్టిపేట మండలంలో 32, 352 మంది అర్హులు ఉండగా ఇప్పటికి మొదటిడోసు 32 వేలు, రెండోడోస్ 17,387 మం ది వేసుకున్నారు. ఇంకా 14,965 మంది రెం డో డోసు వేసుకోవాల్సి ఉంది. దండేపల్లి మం డలంలో మొదటి డోసు 99 శాతం పూర్తయ్యిం ది. ఇక్కడ 15 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో..
చెన్నూర్ మున్సిపాలిటీలో 17,342 మందికి 17,152 మంది మొదటి డోసు తీసుకున్నా రు. మండలంలో 21 వేల మందికి, 20, 200 మందికి పూర్తయినట్లు వైద్యాధికారులు తెలిపారు. రెండో డోసు 6,500 మంది వేసుకున్నారు. కోటపల్లి మండలంలో 98 శాతం, కాగా, ఎర్రాయిపేట గ్రామంలో వందశాతం పూర్తయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. మందమర్రి మండలంలో 97 శాతం పూర్తికాగా, పులిమడుగు, పొన్నారం, కోటేశ్వర రావు పల్లె, వెంకటాపూర్, సారంగపల్లె గ్రామా ల్లో వంద శాతం పూర్తయ్యింది. భీమారం మండలంలోని ఎలకేశ్వరంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగితా 10 పం చాయతీల్లో 97 శాతం టీకా ప్రక్రి య పూర్తయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. జైపూర్ మండలంలోని కుం దారం, జైపూర్ పీహెచ్సీ పరిధిలో మొ దటి డోస్‌కు 34,941 మంది అర్హు లు ఉండగా, 34,588 మంది టీకా వేసుకున్నారు. 95 శాతం పూర్తయ్యింది.