
సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ
ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రఘోత్తాంరెడ్డి
పీఆర్టీయూ నిర్మల్ జిల్లా కార్యవర్గం
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 12 : సీఎం కేసీఆర్ విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తూనే ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యాగార్డెన్‌లో పీఆర్టీయూ జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్య బలోపేతానికి పాఠశాలల్లో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దీన్ని కొన్ని సంఘాలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. విద్యారంగ సమస్యలను ఎప్పుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా సానుకూలంగా స్పందించారన్నారు. ఇటీవల ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పీఆర్టీయూ చేసిన వినతిని నెరవేర్చారని తెలిపారు. అలాగే భాష పండితులు, పీఈటీలకు ఉద్యోగోన్నతులు కల్పించారని చెప్పారు. పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేయడం వల్ల పేద విద్యార్థులు ఉచిత విద్య పొందే అవకాశం కలిగిందన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అన్ని విధాలా ముందుండి నడుస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పీఆర్టీయూ పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఎం అరవింద్, కోట వేణు, మల్కగౌడ్, నాయకులు సుభాష్, లస్మన్న, శ్రీనివాస్, మల్లారెడ్డి, గజ్జారాం, అన్సర్, మల్లన్న, సిద్దిరాం, రమాదేవి, కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం..
అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా బీవీ రమణారావు, అసోసియేషన్ అధ్యక్షులుగా సంజీవ్‌రావు, బీఎల్వీ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీహెచ్ వందన, అశోక్‌రెడ్డి, గంగామోహన్, లక్ష్మణ్, కే శ్రీనివాస్, వీ గణే శ్, మహిళా ఉపాధ్యక్షురాలిగా దేవిప్రియ, కార్యదర్శులుగా చింత మోహన్, మారన్న, శ్రీనివాస్, మసియొద్దీన్, మహిళా కార్యదర్శిగా స్వరూప ఎన్నికయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. తమ బాధ్యతగా అందరికీ అందుబాటులో ఉంటూ విద్య, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హామీ ఇచ్చారు.