
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం అదృష్టం
పద్మశ్రీ కనకరాజు
అవార్డు అందుకొని జిల్లాకు వచ్చాక ఉమ్మడి జిల్లా వాసుల ఘన స్వాగతం
కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్మల్ టౌన్, నవంబర్ 11: ఆదివాసీ బిడ్డనైన తనకు గుస్సాడీ నృత్యం తెచ్చిన గుర్తింపు కొత్త అ నుభూతినిచ్చిందని పద్మశ్రీ కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పుర స్కారం అందుకున్న తర్వాత గురువారం నిర్మల్ జిల్లా మీదుగా ఆసిఫాబాద్‌కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో ఆదివాసీ సంఘా ల ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎ దుట రాంజీగోండు, కుమ్రంభీం విగ్రహాలకు పూ లమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అ నంతరం పద్మశ్రీ కనకరాజును మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఘనంగా సన్మా నించారు. 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్యం ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా కనకరాజు ఈ అవార్డు అందుకోవడం అభినందనీయమని చైర్మన్ పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, వైస్ చైర్మన్ సాజిద్, మంత్రి పీఏ నాళం శ్రీనివాస్, మున్సిపల్ విప్ వేణు, నాయకులు పా ల్గొన్నారు. అదే విధంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు భీంరా వు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
పద్మశ్రీ అవార్డు అందుకున్న కనకరాజును బీసీ సంఘాల నాయకులతో పాటు పాత్రికేయులు, వి విధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. బీసీ సంఘాల నాయకులు అన్ముల భాస్కర్, కృష్ణమోహన్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 11: మండలంలోని కెస్లా పూర్ నాగోబా ఆలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీ త కనక రాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంత రం మండలంలోని ముత్నూర్ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి ఫూలమాల వేసి నివాళుల ర్పించారు. మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళుల ర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు ఆ త్రం భుజంగ్‌రావ్, కనక వెంకటేశ్, మెస్రం నాగ్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.