
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు
ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి
నిర్మల్ టౌన్, నవంబర్ 11 : విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో గురువారం జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా నవంబర్ 11న విద్యా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. డీఈవో రవీందర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యా పథకాలను సద్వినియోగం చేసుకోండి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ 133వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుందరీకరణ పనుల్లో భాగంగా మౌలానా అబుల్‌కలాం క్లాక్‌టవర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అజీంబిన్ యాహియా, వైస్ చైర్మన్ సాజిద్ అహ్మద్, కలాం గుణం సొసైటీ అధ్యక్షుడు ఉస్మాన్, ఉపాధ్యక్షుడు మజర్, నాయకులు రాజేశ్వర్, వేణు, సలీం, మతిన్, ముజాహిత్, రఫీ పాల్గొన్నారు.
ఉద్యోగులు భాగస్వాములు కావాలి
ప్రభుత్వాభివృద్ధిలో ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాంబాబు అన్నారు. నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించే సర్వేలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని 142 పాఠశాలలల్ల్లో 179 మంది పరిశీలకులు, 218 మంది ప్రత్యేక సిబ్బందితో ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ప్రాముఖ్యతను వివరించారు. డీఈవో రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.