మందమర్రి, అక్టోబర్11: దుర్గా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో 1వ జోన్లో గల వరసిద్ధి వినాయక మండపంలోని వనదుర్గాదేవి ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతర అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశ్వనాథ ఆలయంలో మహా చండీయాగం
మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 11:జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో చండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు సతీమణి రాజకుమారి పాల్గొని ఒడి బియ్యాన్ని సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, 16వ వార్డు కౌన్సిలర్ నల్ల శంకర్, విశ్వనాథ ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాస్, సర్వజనని దుర్గాదేవి పూజా కమిటీ అధ్యక్షుడు బోడ ధర్మేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అత్తి సరోజ, విశ్వనాథ ఆలయ కమిటీ ధర్మకర్తలు, పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, భక్తులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
అమ్మవారికి బోనం సమర్పించిన శ్రీరాంపూర్ జీఎం
శ్రీరాంపూర్, అక్టోబర్ 11: శ్రీరాంపూర్ ఓసీపీపై బోనాల పండుగ సందర్భంగా ఊరేగింపును టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జీఎం సురేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, మేనేజర్ జనార్దన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు డీ అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, నస్పూర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఈఈ చంద్రశేఖర్, నాయకులు గుంట జగ్గయ్య, నర్సయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, పెద్దింటి మల్లేశం, సీనియర్ పీవో శంకర్, ఈఈ శ్యాంసుందర్ పాల్గొన్నారు.