అదనపు జిల్లా జడ్డి డీ వెంకటేశ్
పలు కేసుల పరిష్కారం
గర్మిళ్ల, సెప్టెంబర్ 11 : క్షణికావేశంలో చేసిన కేసులను రాజీమార్గం ద్వారానే పరిష్కరించుకోవచ్చని లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని అదనపు జిల్లా జడ్జి డీ వెంకటేశ్ తెలిపారు. శనివారం మంచిర్యాలలోని కోర్టుల ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాజీ మార్గం కక్షిదారులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు వీ తిరుపతి, మహతి వైష్ణవి, సుమన్ గ్రేవాల్, అసోసియేషన్ సభ్యు లు మురళీధర్, భుజంగరావు, సత్యశ్రీలత, శిల్ప, సత్తన్న, మల్లన్న, రమేశ్, సదయ్య, కోర్టు సిబ్బంది, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట కోర్టులో 516 కేసుల పరిష్కారం
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 11: క్షణికావేశంలో చేసిన తప్పులను సరిచేసుకోవడానికి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 516 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పాల్ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమారెడ్డి, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ నారాయణ నాయక్, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీకాంత్, మధుసూదన్, న్యాయవాదులు గాండ్ల సత్యనారాయణ, రాజేశ్వర్ రావు, కారుకూరి సురేందర్, అక్కల శ్రీదర్, ప్రదీప్ కుమార్, తిప్పని రవికుమార్, పద్మ, వేల్పుల సత్యం, రెడ్డిమల్ల ప్రకాశం, కూడెల్లి అశోక్, చాతరాజు మల్లికార్జున్, మంచాల సదాశివ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్, సెప్టెంబర్ 11: చెన్నూర్ మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి, భీమారం, జైపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు కేసులను రాజీ మార్గం ద్వారా జూనియర్ సివిల్ జడ్జి సాయి కుమార్ పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మల్లేశం, న్యాయవాదులు రమేశ్, కార్తిక్, మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లిటౌన్, సెప్టెంబర్ 11 : జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించారు. సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులను జడ్జి గొల్ల హిమబిందు రాజీ చేసి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు అంకెం శివకుమార్, రాజేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌లో 1023 కేసుల పరిష్కారం
ఆసిఫాబాద్, సెప్టెంబర్11: రాజీతోనే కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన బెంచ్‌లలో న్యాయమూర్తులు సురేశ్, షరీనా కేసులను పరిష్కరించారు. లోక్ అదాలత్‌లో 1023 కేసులు పరిష్కరించగా అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో 718 , జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 270 కేసులు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో 34 కేసులు,మూడవ అదనపు జిల్లా కోర్టులో మోటర్ వెహికల్ ఎక్సిటెండ్ 1 కేసును పరిష్కరించినట్లు న్యాయమూర్తులు తెలిపారు. కేసుల పరిష్కరంలో రూ॥ 8,87,150 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు, న్యాయవాదులు ముక్త సురేశ్, జగన్మోహన్, చంద్రకుమార్, ప్రభుత్వ న్యాయవాది దీపక్ , సీఐ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
509 క్రిమినల్ కేసులు పరిష్కారం
సిర్పూరు(టి), సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 509 కేసులను పరిష్కరించినట్లు న్యాయమూర్తి బత్తుల రామారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవ్యాదులు కిశోర్ కుమార్, గంట లక్ష్మణ్, సతీశ్, కాగజ్‌నగర్ సీఐ మోహన్, సిర్పూర్(టీ) ఎస్ఐ రవికుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు.