
రాష్ట్ర స్కీంతో యేడాదికి రూ.10 వేలు రైతన్న ఖాతాలో జమ
కేసీఆర్ పథకాలతో ఆనందంలో అన్నదాతలు
ఆదిలాబాద్, సెప్టెంబరు 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి);రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతన్నలకు వరంగా మారింది. వానకాలం, యాసంగికి కలిపి యేడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నది. ఈ డబ్బులను రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీ డబ్బులు చెల్లించడం వంటి వాటికి ఉపయోగించు కుంటున్నారు. ఇదే సమయంలో కేంద్ర సర్కారు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కూడా అమలు చేస్తున్నది. దీనిద్వారా రైతులకు అరకొరగా సాయం అందుతుండగా.. నిబంధనల కొర్రీతో అందరికీ అందడం లేదు. ఐదెకరాలు ఉన్న వారికి ఎకరాకు రూ.6 వేల చొప్పున మూడు విడుతలుగా అందిస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా పట్టా పాసుపుస్తకం ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుం డగా.. మూడేళ్ల కిందట ఎంపిక చేసిన వారికి మాత్రమే కిసాన్ సమ్మాన్ డబ్బులు అందుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతుబంధు లబ్ధిదారులు 1,47,026 మంది ఉండగా.. కిసాన్ సమ్మాన్ పథకం వర్తించే వారు 92,266 మంది మాత్రమే ఉండడం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దీంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా పంటల సీజన్ ప్రారంభమైందంటే చాలు రై తులు విత్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం ఇబ్బందులు పడేవారు. బ్యాంకు రుణాల సరిగా అందకపోవడం, విత్తనాలు వేసే సమయానికి చేతిలో డబ్బులు లేకపోగా వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించేవారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అంటగట్టేవారు. ఫలితంగా ఎంతో కష్టప డి సాగు చేసిన పంటల దిగుబడులు సరిగా రాక రైతులు నష్ట పోవాల్సి వచ్చేది. రైతులే పెట్టుబడుల కోసం ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. సీజన్ కు ముందుగానే పైసలు చేతిలో ఉండడంతో రైతులు నాణ్య మైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకొని సకాలంలో పంటలు వేసుకుని మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
వరంగా రైతుబంధు..
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగం గా ప్రస్తుతం 1,47,026 మంది రైతులకు రూ. 552.96 కోట్ల ను అందజేస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా నాలుగేళ్ల కిందట గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వ హించిన రెవెన్యూ అధికారులు సాగు భూములు, పట్టాదారుల లెక్కను తేల్చారు. కొన్ని భూములను పార్ట్-బీలో ఉంచి వా టిని సైతం పరిష్కరి స్తున్నారు. జిల్లాలో 2018 వానకాలంలో 1,15,774 మంది రైతులకు ప్రభుత్వం రూ. 181 కోట్ల పంపి ణీ చేసింది. రెవెన్యూ అధికారులు క్రమంగా భూముల సమ స్యలు పరిష్కరిస్తూ అర్హు లైన రైతులకు పట్టా పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. ఫలితం గా జిల్లాలో పట్టాదారుల సంఖ్య ఏ టా పెరుగుతుంది. 2021 వానకాలంలో 1,47,026 మంది రైతులకు ప్రభుత్వం 276. 48 కోట్లను రైతుబంధు సాయంగా అందించింది. తెలంగాణ సర్కారు ఇస్తున్న పెట్టుబడితో రైతులు రెండు పంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
అరకొరగా కిసాన్ సమ్మాన్ సాయం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మా న్ నిధి యోజనతో రైతులకు అరకొర సాయం అందుతున్నది. ఈ పథకానికి 5 ఎకరాల భూమి ఉన్న రైతులు మాత్ర మే అర్హులు. 2018 డిసెంబరు నాటికి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులను మాత్రమే లబ్ధిదారులుగా తీసుకున్నారు. దీంతో జి ల్లాలోని 92,266 మంది అర్హులుగా ఉన్నారు. కిసాన్ స మ్మా న్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలను మూడు విడుతలుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.
మూడేళ్ల కిందట లెక్కతేలిన వారిని అర్హులుగా గుర్తించగా ని బంధనల ప్రకారం కొత్తవారికి అవకాశం లేకుండా పోయింది. కొత్త పట్టాపాసు పుస్తకాలు జారీ చేసిన వారికి, నిర్ణీత తేది అమ లు తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులకు, దళితబస్తీ పథకంలో భాగంగా ప్రభుత్వం భూములు మంజూరు చేస్తున్న వారికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో సాయం అందడం లేదు. కుటుంబంలో ఎంత మందికి భూమి ఉన్నా ఒక్కరినే లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో రైతులందరికీ ఈ పథకం వర్తించడం లేదు. రైతుబంధులో 1,47,026 మంది లబ్ధిదారులుగా ఉండగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లో 92,266 మంది మాత్రమే అర్హులు ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం పథకంతో పోలిస్తే రైతుబంధు పథకం లబ్ధిదారులు సంఖ్య 54,760 ఎక్కువగా ఉంది. కిసాన్ సమ్మాన్ ద్వా రా రైతులకు సాయం అందకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు. రైతుబంధు పథకం ద్వారా తెలంగాణ ప్రభు త్వం తమను ఆ దుకుంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధుతో మేలు..
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో పెట్టుబడికి ఇబ్బంది లేకుండా అయ్యింది. ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు అందజేస్తున్న ది. దీంతో ఎరువులు, విత్తనాలు కొ నుక్కుంటున్నాం. పీఎం కిసాన్‌కు సం బంధించి కేవలం రూ. 2 వేల చొప్పున ఏడాదికి మూడుసార్లు వేస్తున్నరు. ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు.
-సతీశ్‌రెడ్డి, రైతు, పాలోడి , తాంసి మండలం
కేంద్ర డబ్బులు రావడం లేదు..
నాపేరు మగిడి ప్రకాశ్. మాది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామం. నాకు మా గ్రామంలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైనప్పటి నుంచి నాకు ఒక్కసారి కూడా డబ్బులు రాలేదు. తెలంగాణ సర్కారు ఇస్తున్న రైతుబంధు డబ్బులు ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. కేంద్ర సర్కారు ఇస్తారని చెప్పారు కానీ.. రావడం లేదు. అధికారులను అడిగితే మీకు రావని అంటున్నారు. కేసీఆర్ సార్ ఇచ్చిన డబ్బులే ఆదుకుంటున్నాయి.