అప్రమత్తతే ఆయుధం.. వేసవిలో భారీగా అగ్ని ప్రమాదాలు
ఎండలు మండి పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య ప్రదేశాలు, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అప్రమత్తతే ఆయుధం అని అధికారులు అంటున్నారు.
- నిర్మల్ జిల్లాలో గతేడాది 113 ప్రమాద కేసులు నమోదు
- రూ.1.71 కోట్ల నష్టం.. రూ.15.89 కోట్ల ఆస్తిని కాపాడిన అధికారులు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 ః ఎండలు మండి పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య ప్రదేశాలు, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అప్రమత్తతే ఆయుధం అని అధికారులు అంటున్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించి, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్లలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 113 అగ్నిమాపక కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.1.71 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి సకాలంలో మంటలను ఆర్పడంతో దాదాపు రూ.15.89 కోట్ల ఆస్తి మంటల్లో బూడిద కాకుండా కాపాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నిర్మల్ ప్రాంతం వారు 8712699218, భైంసా 8712699220, ఖానాపూర్ 8712699222 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని నిర్మల్ జిల్లా ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు.
తాజాగా జరిగిన అగ్ని ప్రమాదాలు
- నిర్మల్ పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్లో రెండు సార్లు ఇటీవల మొబైల్ రిపేర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది.
- నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ చౌరస్తాలో గల కేక్ బాక్స్ బేకరీలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రిడ్జిలు, సామగ్రి పూర్తిగా దగ్ధం కాగా.. దాదాపు రూ.20 లక్షల ఆస్తినష్టం సంభవించింది.
- నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం డబుల్ బెడ్రూంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఫ్రిజ్ పేలి ఇద్దరు మృతి చెందారు.
- నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్లో గల ఓ బ్యాటరీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరుగగా.. రూ.5 లక్షల విలువ చేసే బ్యాటరీలు, సామగ్రి దగ్ధం అయ్యాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

