బోథ్, ఏప్రిల్ 3 : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బోథ్ మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్‌కు 674 మందికి గాను 672 మంది విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాధికారి అన్రెడ్డి భూమారెడ్డి తెలిపారు. కౌఠ(బీ) కేంద్రంలో 93కు గాను 93, సొనాలలో 140కి గాను 139, గురుకుల పాఠశాలలో 202కు గాను 201, ఆదర్శ పాఠశాలలో 239 మందికి అందరూ పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పకడ్బందీగా పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, ఏప్రిల్ 3 : మండల కేంద్రంలో జడ్పీ పాఠశాల(ఏ)లో 240 మంది, జడ్పీ పాఠశాల(బీ)లో 212 మంది, గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో 280 మంది, బాలికల పాఠశాలలో 269 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదని ఎంఈవో రాథోడ్ ఉదయ్‌రావ్ తెలిపారు.
జైనథ్, ఏప్రిల్ 3 : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 168 మంది, గిమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో 203, పెండల్వాడలో 96, మోడల్స్కూల్లో 152 మొత్తం 619 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో నారాయణ తెలిపారు. గిమ్మలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ నరేశ్, జైనథ్‌లో కేంద్రాన్ని ఎస్ఐ బిట్లపెర్సిస్ తనిఖీ చేశారు.
భీంపూర్, ఏప్రిల్ 3 : అందర్‌బంద్ గ్రామంలోని గిరిజన ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. 127 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ఎంఈవో శ్రీకాంత్ తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్ఐ రాధిక సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
నార్నూర్, ఏప్రిల్ 3 : నార్నూర్‌లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల పరీక్షా కేంద్రంలో 185 మంది విద్యార్థులు, తాడిహత్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 175, గాదిగూడలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 106 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారని ఎంఈవో రాపెల్లి ఆశన్న తెలిపారు. నార్నూర్‌లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ ఆర్కా మోతీరాం, ఎస్ఐ రవికిరణ్ తనిఖీ చేశారు. పరీక్ష గదులు పర్యవేక్షించారు. మాస్ కాపీయింగ్‌కు తావివ్వకుండా చూడాలని సీఎస్, డీవోకు సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 3 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి 221 మంది విద్యార్థులకు 219 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 196 మందికి 194 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. కేస్లాపూర్ ఆశ్రమ పాఠశాలలో 224 మందికి 223 మంది విద్యార్థులు హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారని మండల విద్యాధికారి నారాయణ తెలిపారు. మొత్తం 636 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు తెలిపారు.
భీంపూర్, ఏప్రిల్ 3 : తాంసిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 190 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎవరూ కూడా గైర్హాజరు కాలేదు. కప్పర్లలో 184కి 184 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
ఉట్నూర్, ఏప్రిల్ 3: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల బాలుర, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల బాలికలు, క్రీడా ఆశ్రమ పాఠశాల, పూలాజీబాబా విద్యాసంస్థల్లో 220 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పాఠశాలల వద్ద ఉట్నూర్ ఎస్ఐ భరత్ సుమన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.