
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్
ఖానాపూర్ టౌన్, సెపెంబర్ 9: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ కమిటీల ఇన్చార్జి వీ గంగాధర్ గౌడ్ అన్నారు. పట్టణంలో ఏఎంకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్యర్యం లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర పుర పాలకశాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 12 వరకు పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. 12 నుంచి 20 వరకు మండల కమిటీలు, 20 నుంచి 24 వరకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉం టుందన్నారు. కమిటీల ఏర్పాటు పూర్తి కాగానే దసరాకు పదవుల పండుగ ఉంటుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వాలు 60 వేల వరకు ఉన్నాయని, రాష్ట్ర కమిటీ ఏర్పాటులో ఖానాపూర్ నాయకులకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ ఎమ్మెల్సీగంగాధర్ను కోరారు. అనంతరం కాళోజీ నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, డీడీసీ చైర్మన్లను సన్మానించారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, ఎంపీపీ మొయిద్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, అమంద శ్రీనివాస్, మండల, పట్టణ అధ్యక్షులు తాళ్లపెల్లి రాజగంగన్న, పరిమి సురేశ్, ప్రధాన కార్యదర్శి తూము చరణ్, కౌన్సిలర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక
దస్తురాబాద్, సెప్టెంబర్ 9 : మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ కమిటీల ఇన్చార్జి గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమా రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీకి చెందిన రేవోజిపేట ఎంపీటీసీ వెడ్మా మాన్కు , తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం సురేందర్, గొడిసేర్యాల గోండు గూడెం,మున్యాల గోండు గూడెంకు చెందిన 150 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, మున్యాల సర్పంచ్ దుర్గం శంకర్, గొడిసేర్యాల ఉప సర్పంచ్ మాణిక్యా రావు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సిర్ప సంతోష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికె అయిలయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు విలాస్ యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జీలు గోపి, రాజేందర్, నాయకులు రామడుగు రమేశ్ రావు, సంతపూరి శ్రీనివాస్, దుర్గం రాజలింగం, కొక్కుల రాజేశం, శంకర్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.