
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : టీఆర్ఎస్ ప్రభు త్వం తెలంగాణ భాష, సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
కాళోజీకి నివాళి
ఎదులాపురం,సెప్టెంబర్ 9: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్లో నివాళులర్పించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు ఎస్ భీమ్ కుమా ర్, సుదర్శనం, రాజేందర్, అరవింద్ కుమా ర్, వర్ణ, నలంద, ప్రియ, స్వాతి పాల్గొన్నారు.