
ఏడో రోజూ ఊరూవాడా అంబరాన్నంటిన సంబురాలు
పొలంలో వరి నారుతో కేసీఆర్ అక్షరమాల
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు
నార్నూర్/దిలావర్పూర్/సోన్/జైనథ్/బాసర, జనవరి 9;ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు సంక్రాంతి పండుగోలె కొనసాగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం కూడా ఊరూవాడా మహిళలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ చిత్రాలు తెలిపేలా రంగురంగుల ముగ్గులు వేశారు. మహిళా రైతులు పంట పొలాల్లో వరినారుతో కేసీఆర్ ఆంగ్ల అక్షరాలు రాశారు. జై కేసీఆర్.. జైజై తెలంగాణ నినాదాలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు ఎత్తుకొని ర్యాలీ తీశారు. ఎడ్లను, బండ్లను అందంగా అలంకరించి భారీ ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని సోన్, దిలావర్పూర్ మండలాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా.. బాసర మండలంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, గాదిగూడ మండలంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ముగ్గులు వేశారు. నిర్మల్ జిల్లా సోన్, దిలావర్పూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సంబురాల్లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎడ్లబండి, ట్రాక్టర్ నడిపారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కేంద్రంతోపాటు లోకారి(కే)లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని చౌటపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముగ్గులను తిలకించారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.