
రైతుబంధు సంబురాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తాండూర్, జనవరి9 : వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్రంలోని రైతుల దశ మార్చి, వారిని ఆర్థికంగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొనియాడారు. ఆదివారం తాండూర్ మండలం చౌటపల్లి గ్రామంలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. తాండూర్ మండలంలో రూ. 68.91 కోట్లను రైతుబంధు సాయాన్ని అందించామని, 76 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రైతు బీమా అందించామని తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోడు భూము ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చౌటపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యేను గ్రామ పొలిమేరల నుంచి కూడలి వరకు సర్పంచ్ శంకర్, ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ దత్తాత్రేయరావు, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి, గ్రామస్తులు, మహిళలు, పార్టీ శ్రేణులు బోనాలతో, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. మహిళలతో కోలాటం ఆడారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దాగాం నారాయణ, ఎంపీటీసీ సిరంగి శంకర్, కో ఆప్షన్ సభ్యుడు నజ్జీఖాన్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మాసాడి తిరుపతి, మత్స్యకార సంఘం అధ్యక్షుడు కంపెల చిన్నయ్య, ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, నాయకులు ముదాం రఘు, చీమల రాజలింగు, చాంద సురేశ్, చీమల లచ్చన్న, గొర్లపల్లి విజయ్, ఎల్క రాంచందర్, గణపతి అంజి, ముస్కె సాగర్, ఏవో కిరణ్మయి, ఏఈవో శంకర్, పుష్పలత, ఐకేపీ ఏపీఎం సోమానాయక్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లిరూరల్, జనవరి 9: బెల్లంపల్లి మండలంలోని గురిజాల రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. బెల్లంపల్లి మండలంలో 30 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందించామని, రూ.174 కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అనంతరం బట్వాన్పల్లిలోనిలంబాడీతండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెర్కపల్లిలో ముగ్గుల పోటీల విజేతలు బహుమతులు అందజేశారు. గ్రామాభివృద్ధికి నిధుల మంజూరుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్,మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సింగం గణేశ్‌గౌడ్, గురిజాల , పెర్కపల్లి సర్పంచులు గాజుల రంజిత, రామగోని పద్మావతి, రామగోని అశోక్‌గౌడ్, రాంటెంకి నిర్మల, ఎంపీటీసీ కలాలి శకుంతల, జిల్లా వ్యవసాయాధికారి వీరన్న, బెల్లంపల్లి ఏడీఏ సురేఖ, ఎంపీడీవో డీ రాజేందర్, ఏవో ప్రేమ్‌కుమార్, ఎంపీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, మాజీ సహకారసంఘం చైర్మన్ సింగతి పెద్దన్న, సర్పంచ్‌లు అశోక్‌గౌడ్, గుర్రాల రాయమల్లు, వేముల కృష్ణమూర్తి, కారుకూరి వెంకటేశ్, సీనియర్ నాయకులు గడ్డం భీమాగౌడ్లతో పాటు పలువురు ఎంపీటీసీలు, రైతులు, డ్వాక్రాగ్రూపు మహిళలున్నారు.
జన్నారం మండలంలో సంబురాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్..
జన్నారం, జనవరి 9 : జన్నారం మండల కేంద్రంలో పొనకల్ రైతు వేదిక వద్ద ఐకేపీ మహిళలు, బాలికలు, మహిళా రైతులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కోలాటం ఆడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బంధు, పంట రుణ మాఫీతో రాష్ట్రంలోని రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు జీ రాజారాంరెడ్డి, ఎంపీపీ మాదాడి సరోజన, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, పట్టణ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, ఏవో సంగీత, వైస్ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ సీపతి బుచ్చన్న, పొనకల్, చింతగూడ సింగిల్ విండో చైర్మన్లు శీలం రమేశ్, నాసాని రాజన్న, ఎంపీటీసీల పోరం జిల్లా అద్యక్షుడు మహ్మద్ రియాజొద్దీన్, వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, ఎస్కే మౌలానా, అడెపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.