
మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున బీమా చెక్కుల అందజేత
మంచిర్యాలటౌన్, జనవరి 9: ఇటీవల మృతి చెందిన మంచిర్యాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీమా చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి అందజేశారు. 28వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుత్తికొండ రవి విద్యుత్ షాక్తో గతేడాది ఫిబ్రవరి 5న మృతిచెందాడు. సంజీవయ్య కాలనీకి చెందిన రామిళ్ల సురేశ్ కూలీ పనులకు వెళ్లి భవనం పైనుంచి పడి డిసెంబర్ 30న మృతిచెందాడు. వీరిరువురు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కార్యకర్తలందరికీ బీమా సౌకర్యాన్ని టీఆర్ఎస్ పార్టీ చేయించింది. దీంతో ఈ రెండు కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్రెడ్డి, జగన్, జయరామారావు, పడాల రవీందర్, ఆరె శ్రీనివాస్, ఖాజామియా, వెంకటసాయి, తదితరులున్నారు.
సాయం మరువలేం ..
టీఆర్ఎస్ పార్టీ పరంగా తన భర్త రవి పేరిట బీమా చేయించి కుటుంబానికి రెండు లక్షలు అందించడం ఎప్పటికీ మరువలేము. ఇంటి పెద్దను కోల్పోయాక దిక్కుతోచని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు అందించిన సహకారం మరువలేనిది. సీఎం కేసీఆర్ సార్ మేమంతా రుణపడి ఉంటాం.
-రమాదేవి(టీఆర్ఎస్ కార్యకర్త రవి భార్య )