
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,సెప్టెంబర్ 8: ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యత గ్రా మాల్లో పంచాయతీ కార్యదర్శులపై ఉందని ఆది లాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా వనరుల కేంద్రంలో ఇచ్చోడ క్లస్టర్ పరిధిలోని పం చాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆకాంక్షతో క్లస్టర్ల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శుల సమస్యలు తెలుసుకొని, వృత్తి రీత్యా వారికి సలహాలు, సూచనలు అందిస్తామని పేర్కొ న్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ను గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ము ఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఉదయాన్నే విధులకు వెళ్లండి..
పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యత కార్యదర్శులపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు విధిగా విధులకు హాజరు కావాలన్నా రు. పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన ని వేదికలు మధ్యాహ్నం 3 గంటలలోగా సమర్పించాలన్నా రు. కార్యదర్శులు, వారి కుటుంబ సభ్యు లు త ప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, అదే విధంగా గ్రామంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స భ్యులు, వర్కర్లు, గ్రామస్తులు వ్యాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేయాలని సూచించారు. ఇకపై విధుల్లో శ్రద్ధ చూపే వారికి ప్రతి 45 రోజులకు ఇద్దరికి రివార్డు లు అందజేస్తామన్నారు. జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి, అధికారులు పాల్గొన్నారు.