
బోథ్, ఆగస్టు 8: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్డీ (బీ) రాయిసెంటర్ సార్మేడి తొడసం బండు పిలుపునిచ్చారు. ఆదివారం సొనాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సొనాలలోని కుమ్రం భీం విగ్రహం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. రాయిసెంటర్ పరిధిలోని గ్రామాల పటేళ్లు, దేవరి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, ఆదివాసీ యువకులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మేస్రం భూమన్న, రాయిసిడాం ఇస్రు, గంగాధర్, శంకర్, భీంరావు, దేవరావు పాల్గొన్నారు.
ఆదివాసీ యువత తరలి రావాలి
బోథ్‌లో సోమవారం నిర్వహించే ఆదివాసీ దినోత్సవానికి ఆదివాసీ యువకులంతా తరలిరావాలని కుమ్రం భీం గోండ్వానా యువసేన అధ్యక్షుడు పెందూర్ వినీత్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్నాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఆత్రం భీంరావు, ఆత్రం కోవిందు, సిడాం నారాయణ, అర్క జగదీశ్, కాంతారావు, అర్క రామారావు, రాయిసిడాం సంతోష్, సార్మెడి భీంరావు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
ఉట్నూర్, ఆగస్టు 8: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతరం చేయాలని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, గోండ్వానా పంచాయత్ రాయిసెంటర్ల సార్మేడి మెస్రం దుర్గు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో ఆదివాసీ భవన్లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో పీసా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అర్క వసంత్‌రావు, కుమ్ర విఠల్‌రావు, ఆత్రం భుజంగ్‌రావు, అక్ర మాణిక్‌రావు, మాడావి గణపతి, సీతారాం, శాంతారాజ్, నిరంజన్, హన్మంత్‌రావు, ఏఈ సతీశ్ పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
నేరడిగొండ, ఆగస్టు 8 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ మండలాధ్యక్షుడు జుగ్నక్ సంబన్న, రాయిసెంటర్ సార్మేడి ఆత్రం సోనేరావు పిలుపునిచ్చారు. ఆదివాసీ గ్రామాల్లోని పటేళ్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యావంతులు, ఆదివాసీ ప్రజలు తప్పకుండా హాజరుకావాలని కోరారు.