
కుంటాల, జనవరి 8 : కుంటాల మండలంలో ని గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషిచేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మండల నాయకులు శనివారం ఆయ నను తన నివాసంలో కలిశారు. భారీ వర్షాలకు దె బ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పీఆర్, ఆర్అండ్బీ రహదారుల మరమ్మతులకు అవసరమయ్యే నిధులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆ ర్అండ్బీ పరిధిలోని రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. వంజర్, వానల్పాడ్, పెంచికల్‌పాడ్, అందకూర్, తిమ్మాపూర్, కుంటాల, దౌ నెల్లి, ఓల, సూర్యపూర్, అంబుగాం, ఓల-అంబ కంటి, నందన్ రోడ్ల మరమ్మతులకు నిధుల మం జూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పార్టీ మం డల కన్వీనర్ పడకంటి దత్తు, బామిని సర్పంచ్ పోశెట్టి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి బుచ్చన్న, ఏఎం సీ డైరెక్టర్ సబ్బిడి గజేందర్, నాయకులు దొనికెన వెంకటేశ్, గజేందర్, హన్మండ్లు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు
లోకేశ్వరం, జనవరి 8 : లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తన ఫండ్స్ నుంచి నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో రైతుబంధు సంబురాల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ధర్మోరా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.2 లక్షలు, పంచగుడి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.10 లక్షలు, మన్మధ్ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.3 లక్షలు, మన్మధ్ నుంచి సుద్దవాగు వరకు రోడ్డు, గ్రావెల్ కోసం రూ.2 లక్షలు, అబ్దుల్లాపూర్ గంగపుత్ర కమ్యూనిటీ హాల్‌కు రూ.లక్ష, బామిని (కె) వ్యవసాయ పొలాలకు రోడ్డు కోసం రూ.2 లక్షలు, గడ్‌చాంద గ్రామ బీసీ కమ్యూనిటీ హాల్ కోసం రూ.2.50 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, సర్పంచ్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుజంగ్‌రావు, టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కపిల్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు మెండే శ్రీధర్, తుంగెన లక్ష్మణ్ రావు, కుంటాల సాగర్, ప్యాట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.