
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఆదిలాబాద్ రూరల్, జనవరి 8 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ లాంటి పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా శనివారం మావలలో ఎడ్లబండి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలిపారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అంతకుముందు మావలలోని శారదానగర్‌లో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ నల్లా వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరీ, సర్పంచ్ దొగ్గలి ప్రమీల, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు నల్లా రాజేశ్వర్, చందాల రాజన్న, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెట్టుబడి సాయంతో.. అన్నదాతల్లో ఆనందం
ఇచ్చోడ, జనవరి 8 : తెలంగాణలో పెట్టుబడి సాయంతో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రజా యూత్ గ్రామ అధ్యక్షుడు నిమ్మల సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా పని చేస్తున్నారని అన్నారు. మండలంలోని కామగిరి గ్రామంలో రైతులు, గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో ఎడ్ల బండి ర్యాలీ తీశారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, సర్పంచ్ తొడసం భీంరావ్, ఎంపీటీసీ నిమ్మల శివకుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ సుజాత, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంద వెంకటరమణ, నాయకులు గోపిడి మహేందర్ రెడ్డి, మనోహర్, నిమ్మల పోతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి కృషి
బోథ్, జనవరి 8: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. మహిళలు ముగ్గులతో కేసీఆర్ చిత్రపటం వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఆత్మ చైర్మన్ మల్లేపూల సుభాష్, యూత్ విభాగం అధ్యక్షుడు మెడిచెల్మ ప్రవీణ్, మండల ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటరమణాగౌడ్, సంజీవ్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
టక్కుగూడలో..
ఉట్నూర్ రూరల్, జనవరి 8: మండలంలోని టక్కుగూడ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులు రైతు బంధు సంబురాలు జరుపుకున్నారు. మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి తెలుపుతూ ముగ్గులు వేశారు. అనంతరం ఎడ్ల బండి ర్యాలీ తీశారు. ఆకట్టుకునే విధంగా ముగ్గులు వేసిన మహిళలకు ఏవో గణేశ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఈవోలు జయశ్రీ, శ్వేత, సర్పంచ్ జగన్, ఉపసర్పంచ్ భగవంత్‌రావ్, కార్యదర్శి విక్రమ్, రైతులు పాల్గొన్నారు.