
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 600 కు పైగా అర్హులు
బాసర -2 జోన్లో 68 ఖాళీలు
ఈ నెల 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
డిసెంబర్లో రాత పరీక్ష
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 7: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందు లో భాగంగా ఐసీడీఎస్‌లోని సూపర్వైజర్ పోస్టుల భర్తీకి శ్రీకా రం చుట్టింది. అంగన్వాడీ టీచర్లకు గ్రేడ్ -2 సూపర్వైజర్గా ఉద్యోగోన్నతి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి చదివి పదేళ్ల సర్వీసు ఉండి 50 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రమోషన్ కల్పించనున్నారు. నిర్మల్ జిల్లాలో 4 ప్రాజెక్టులు, 816 అంగన్వాడీ కేంద్రాలు , 110 మినీ కేంద్రా లు మొత్తం 916 కేంద్రాలు ఉండగా, 878 మంది అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో టెన్త్ చదివి పదేళ్ల సర్వీసు ఉన్నవారు 150 మంది వరకు ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 600 మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేయనున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 275 ఖాళీలు, బాసర జోన్ -2 లో 68 ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రక్రియ అంతా రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరగనున్నది. దరఖాస్తుల స్వీకరణ విధివిధానాలు, అర్హతల నిర్ధారణ అంతా జిల్లా స్థాయిలో చేపట్టనున్నారు. రాత పరీక్షను రాష్ట్ర స్థాయిలో చేపట్టనున్నారు.
25 అంగన్వాడీ కేంద్రాలకు సూపర్వైజర్..
25 అంగన్వాడీ కేంద్రాలకు ఒక సూపర్వైజర్ పనిచేస్తుంటా రు. వీరు ప్రతినెల టీచర్లతో సమావేశం నిర్వహిస్తుంటారు. చి న్నారుల పెరుగుదల పర్యవేక్షణ, ఎన్‌హెచ్‌టీఎస్, పోషణ ట్రాకర్‌లో నమోదు , చిన్నారులకు టీకాలు, గర్భిణులకు దవాఖాన లో చెకప్ , పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకత, తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు పర్యవేక్షణ చేస్తా రు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద ల చేయడంతో అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.