
సారంగాపూర్, నవంబర్ 7: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బీరవెల్లిలో ఆదివారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించిందన్నారు. రైతులకు నష్టం కలుగకుండా మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. యాసంగిలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్‌రెడ్డి, సర్పంచ్ ఇప్ప రవీందర్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, వీడీసీ చైర్మన్ ఎర్ర మచ్చేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, లక్కడి నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, లక్కడి వెంకటరమణారెడ్డి, లక్కడి నరేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రవీణ్, భూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
కుంటాల, నవంబర్ 7 : మండలంలోని అందకూర్ గ్రామలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని వారు సూచించారు. ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీటీసీ మధు, మాజీ సర్పంచ్ బుచ్చన్న, నాయకులు కిష్టయ్య, ఖదీర్, చంద్రకాంత్, మురళి, నవీన్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ముథోల్, నవంబర్ 7 : వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్ సూచించారు. ముథోల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దళారుల మాటలను నమ్మి రైతులు మోసపోవద్దని, మద్దతు ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, డైరెక్టర్లు సుదర్శన్, గోపి పాల్గొన్నారు.
పొట్టపెల్లి గ్రామంలో..
లక్ష్మణచాంద, నవంబర్ 7 : మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌తో కలిసి డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, సర్పంచ్ హైమావతి, ఎంపీటీసీ రమ, రైతులు పాల్గొన్నారు.