
తాంసి, నవంబర్ 7 : ప్రజా సమస్యల పరిష్కారానికే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్య అథితిగా హాజర య్యారు. డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, భూ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జిల్లా న్యాయ సేవసాధికార సంస్థకు ఫిర్యాదు చేసిట్లయితే ఇరుపార్టీలను పిలిపించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. సర్పంచ్ పనగంటి స్వప్నరత్నప్రకాశ్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు రమణారెడ్డి, వెండి బద్రేశ్వర్‌రావు, కేమ శ్రీకాంత్, మేకల మధుకర్, ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీ ల్దార్ తిరుమల, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.