
భైంసా టౌన్, నవంబర్ 7 : పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంజూరైన పత్రాలను ఆదివారం దేగాంలోని స్వగృహంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. బిజ్జూర్ గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.2.50 లక్షలు, కుంబిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2 లక్షలు, సుంక్లిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2 లక్షలు, పెండ్పెల్లిలో మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2.50 లక్షలు, వానల్పాడ్లో డ్రైనేజీల నిర్మాణానికి రూ.2.40 లక్షలు, హంపోలిలో డ్రైనేజీల నిర్మాణానికి రూ.2.40 లక్షలు, టాక్లిలో సీసీరోడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు, లింగాలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.4 లక్షలు, వాలేగాంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 2.50 లక్షలు, సిరాలలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. లక్షా50 వేలు, వాటోలిలో రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రూ.2.50 లక్షలు, గుండేగాం నుంచి మహగాంకు వయా సౌన గ్రావెల్కు రూ. 2.50 లక్షలు, కుంటాల మండల కేంద్రంలో జడ్పీ స్కూల్ ప్రహరీ నిర్మాణానికి రూ.4 లక్షల 25 వేలు, మాంజ్రి గ్రామంలో పద్మశాలి సంఘ భవన ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.2లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. బిజ్జూర్లో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ. 2.50 లక్షలు మంజూరు చేయడంతో సిద్దార్థ యూత్ సభ్యులు దేగాంలో ఎమ్మెల్యేను కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో బిజ్జూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వెంకట్రెడ్డి, కోతల్గాం సర్పంచ్ భూమేశ్, జీ పుండలిక్, జీ సునీల్, జీ రాహుల్, వాడేకర్ లక్ష్మణ్, జీ సుభాష్, ఏ. సంగనంద్, జీ సంపత్, కుంటాల ఏఎంసీ డైరెక్టర్ సబ్బిడి గజేంధర్, జాగృతి కన్వీనర్ బోగ లక్ష్మణ్,రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనిల్, కళ్యాణి గజేందర్, మ్యాకపు గజ్జారాం, ముసం గణేశ్, పీరాజీ, వాలేగాం ఎంపీటీసీ మాణిక్ రావు, మాజీ ఎంపీటీసీ సురేశ్, టీఆర్ఎస్ నాయకులు రమణా రెడ్డి, పోతన్న, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి, కోఆప్షన్ సభ్యులు గజానంద్, లింగా సర్పంచ్ గణేశ్, టీఆర్ఎస్ నాయకులు సంజీవ్, రాంకుమార్, గణేష్ పాటిల్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.