ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఉట్నూర్, ఆగస్టు 7: ఆదివాసులను పిట్టల్లా కాల్చి పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గతంలో ఎప్పుడూ ఆదివాసులకు వ్యతిరేకంగానే పనిచేసిందన్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంత అ భివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలు ఆడేందుకు వస్తున్నదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క సీఎం కూడా కుమ్రం భీంకు నివాళుల ర్పించలేదని పేర్కొన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ఒక్కరే నివాళులర్పించారని గుర్తు చేశారు. ఆంక్షలు లేకుండా జో డెఘాట్లో వర్ధంతి నిర్వహిస్తున్నారన్నారు. రూ. 25 కోట్లతో భీం మ్యూజియం, రెండు వరుసల బీటీ రోడ్డు, నాగోబా జాతర నిర్వహణ, అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఇంద్రవెల్లిలో సభ పెట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి కాం గ్రెస్‌కు దిక్కయ్యారన్నారు. ఎంపీ సోయం బాపురావు వా రితో కుమ్ముక్కయారని ఆరోపించారు. త్వరలోనే ఆర్వోఎ ఫ్ఆర్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఐటీడీఏ మా జీ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, నా యకులు భాజిరెడ్డి, మర్సుకోల తిరుపతి, ప్రహ్ల్లాద్, పరమేశ్వర్, పురుషోత్తం యాదవ్, నారాయణ ఉన్నారు.