
మందమర్రి జనవరి 7: మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం, భోగి మంటల చుట్టూ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రైతులను సన్మానించారు. పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్‌రావు, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మన్‌రావు, పాఠశాల హెచ్ఎం స్వరాజ్ కృష్ణ, ఆర్ఐ రాజు, కో ఆర్డినేటర్ కృష్ణారావులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వరాజ్ కృష్ణ, డీన్ నాగేశ్వర్రావు, ఏవో ఖుద్దూస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో అర్హులైన 82 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేశారు.
చెన్నూర్‌లో.. చెన్నూర్ రూరల్, జనవరి 7: చెన్నూర్ మండలం నాగాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబురాల్లో భాగంగా బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, సర్పంచ్ అన్నల మానస, ఉపాధ్యాయులు అసద్, సీనయ్య, రెహాన ఖానమ్, రమణయ్య, స్వప్న పాల్గొన్నారు.
కాసిపేటలో..
కాసిపేట, జనవరి 7 : మండలంలోని లంబాడీతండా(ఎస్) ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల, దేవాపూర్ ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో విద్యార్థులకు రంగోళి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కట్టా వాణి కుమారి, జంగంపల్లి సురేశ్, ఆత్రం వరలక్ష్మి, హైస్కూల్ హెచ్ఎం నెన్నెల లచ్చయ్య, ఉపాధ్యాయులు కుడుదుల శ్రీనివాస్, వడ్డీ శంకర్ రావు, భూక్యా కవిత, దేవాపూర్‌లో సీఆర్పీ మంతెన రమేశ్, రొడ్డ మల్లేశ్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లిటౌన్, జనవరి 7 : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నస్పూర్ పట్టణంలో.. సీసీసీ నస్పూర్, జనవరి 7: నస్పూర్‌లోని విద్యానగర్ కృష్ణవేణి హైస్కూల్లో సాంస్కృ తిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ జ్యోతి హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, పాఠశాల కరస్పాండెంట్ బత్తిని దేవన్న, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.