
ఉట్నూర్ రూరల్, నవంబర్ 6: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం మండలంలోని నర్సాపూర్(బీ), సాకేరా(బీ) గ్రామాల్లో దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు ప్రభుత్వం అందించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే దండారీ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి మంజూరీ చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రశీద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, శ్రీరాం నాయక్, సింగారే భరత్, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా ఉటుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన జైపాల్, పోశెట్టికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, లింగోజి తండా సర్పంచ్ హరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సెడ్మకి సీతారాం, శ్రీరాంనాయక్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఇంద్రవెల్లి, నవంబర్ 6: గ్రామీణ ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. రూ.4లక్షలతో హర్కాపూర్ రోడ్డు నుంచి వనవాసీ కల్యాణ పరిషత్, నాగోబా విద్యార్థి నిలయం వరకు చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంద్రవెల్లి సర్పంచ్ కోరెంగా గాంధారితో కలిసి శనివారం భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించి వైద్యంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి సిబ్బంది, రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ఉన్న బాలింతకు కేసీఆర్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుపతి పటేల్ డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జాద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్ టెహెరే. టీఆర్ఎస్ నాయకులు దేవ్‌పూజె మారుతి, కోరెంగా సుంకెట్రావ్, బాబుముండే, వసంత్‌రావ్, శ్రీరాంనాయక్, షేక్ సుఫియాన్, రాందాస్, శ్రీనివాస్, పీఆర్ఏఈ రమేశ్, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.