
తాంసి, నవంబర్ 6: పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తాంసి, బండలనాగాపూర్, కప్పర్ల, గిరిగాం లబ్ధిదారులు 10 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు అందజేశారు. ఇక్కడ జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ పులి నారాయణ, సర్పంచులు కృష్ణ, సదానందం, వెంకన్న, కేశవ్‌రెడ్డి, నర్సింగ్, ఎంపీటీసీ రఘు, నాయకులు ఉత్తం, ధనుంజయ్, గంగారాం తదితరులున్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గుడిహత్నూర్, నవంబర్ 6: తహసీల్ కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బాపురావ్ శనివారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవనచంద్ర, మన్నూర్, తోషం ఎంపీటీసీలు జ్ఞానేశ్వర్, శగీర్ఖాన్, శాంతాపూర్, తోషం సర్పంచులు తిరుమల్‌గౌడ్, సోయం దస్రు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, మండల ప్రజాపరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే జమీర్, టీఆర్ఎస్ నాయకులు మారుతి, దోమకొండ సుధాకర్, దిలీప్, వినోద్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
ఇచ్చోడ, నవంబర్ 6 : ఇచ్చోడలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన కామెరి లక్ష్మికి శనివారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆదిలాబాద్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు రూ. 60 వేలు అందించారు. మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, నాయకులు ముస్కు గంగారెడ్డి, దాసరి భాస్కర్, కారె సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆడ బిడ్డలకు భరోసా ..
బజార్హత్నూర్ నవంబర్ 6: ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ కూన గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బాపురావ్ పంపిణీ చేశారు. ఇక్కడ సర్పంచ్ లావణ్య, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు సాయన్న, నరేశ్, శేఖర్, లక్ష్మణ్, కవీందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.