
నిర్మల్ అర్బన్, నవంబర్ 6 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు నిర్మల్‌లో శనివారం యాదగిరీశుని కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ యాదాద్రి ఆలయ నిర్మాణం గత ఐదేండ్లుగా కొనసాగుతుందని, వచ్చే మార్చి 28 నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తారని తెలిపారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆలయ గోపుర నిర్మాణానికి తన తరపున కిలో బంగారం, నిర్మల్ నియోజక వర్గ ప్రజల తరపున మరో కిలో బంగారం మొత్తం రెండు కిలోలు అందించనున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి తెలిపారు. అనంతరం 2022 ఆలయ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కల్యాణోత్సవంలో ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్‌రెడ్డి, బాపురావ్, దివాకర్‌రావు, నల్లాల ఓదెలు, నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ శోభారాణి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, నిర్మ్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, డీసీసీబీ చైర్మన్ రఘనందన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.