
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లాలో ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, గంగాధర్, నల్లా వణిత, అరుంధతి, కౌన్సిలర్ జాదవ్ పవన్‌నాయక్, నాయకులు నల్లా రాజేశ్వర్, వెంకట్ రెడ్డి, రామ్‌కుమార్, మర్సకోల తిరుపతి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, తెలంగాణ చౌక్‌లోని నిర్వహించిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నివాళులర్పించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు జాదవ్ పవన్ నాయక్, ప్రకాశ్, అజయ్, బండారి సతీశ్, డీఈ వెంకట శేషయ్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జయశంకర్ చిత్రపటానికి డీవైఎస్వో వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోచ్‌లు రవీందర్, రాజు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కోవ విఠల్ నివాళులర్పించారు.
ఎదులాపురం, ఆగస్టు6: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ,ఆత్మ చైర్మ న్ జిట్ట రమేశ్, నాయకులు చిక్కల దత్తు, కోరెడ్డి పార్థసారథి, అంజయ్య, ప్రమోద్ కుమార్ ఖత్రీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో అధ్యక్షకార్యదర్శులు లక్ష్మారెడ్డి, కిష్టయ్య, నాయకులు పాల్గొన్నారు.యాపల్‌గూడ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, కార్యదర్శి ఏ నవీన్ కుమార్, కారిం గుల మోహన్గోపి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీసీఎఫ్ రామలింగం, డీఎఫ్‌వో రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
బేల, ఆగస్టు 6 : మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ వనితా ఠాక్రే, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్‌రెడ్డి, జక్కుల మధూకర్, తన్వీర్‌ఖాన్, దేవన్న, సంతోష్, విఠల్ వారాడే, ఠాక్రే తానుబా, ఎంపీవో సమీర్, సూపరింటెండెంట్ మహేందర్, టీచర్లు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఆగస్టు 6 : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, ఎంపీడీవో తిరుమల, రైతుబంధు చైర్మన్ అహ్మద్ అజీం, నాయకులు పోషన్న, ధరణి రాజేశ్, రాజ్‌కుమార్, కందుకూరి రమేశ్, సతీశ్, సోనేరావు, ఆశన్న, భూమన్న, కోల సత్యం, రవి, సుమన్‌బాయి పాల్గొన్నారు.
నార్నూర్,ఆగస్టు 6: నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే, అధ్యాపకులు, ఎస్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 6: ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అమ్జద్, సర్పంచ్ కోరెంగా గాంధారి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కౌంటర్లకు ఆదివాసీ గిరిజన నాయకుడు సిడాం భీంరావ్ పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, ఆర్ఐ మెస్రం లక్ష్మణ్, నాయకులు దేవ్‌పూజె మారుతి పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 6: మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీడీవో సీహెచ్ రాధ, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, ఎంపీటీసీ కే మహేందర్, సర్పంచ్‌లు బాబూసింగ్, కొడప విజయ్, విశ్వేశ్వర్రావు, ఈజీఎస్, కార్యాలయ సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, రాజు, మల్లేశ్, బుచ్చన్న, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ , ఆగస్టు 6: మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పంచాయతీల్లో జయశంకర్ చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు ముస్తాఫా, వెంకటేశ్, రాథోడ్ ప్రవీణ్ కుమార్, కరే సురేశ్, సాబీర్, భీముడు, అబ్దుల్ రషీద్, తహసీల్దా అతిఖొద్దీన్, ఎంపీడీవో రాంప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, ఎఫ్‌డీవో బర్నోబా, ఎఫ్ఆర్వో పాండురంగ్, పరశురాంపాల్గొన్నారు.
సిరికొండ, ఆగస్టు 6: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సర్పంచ్ నర్మద, ఎంపీటీసీ పర్వీన్, ఉప సర్పంచ్ చిన్నరాజన్న, సిరికొండ సింగిల్ విండో డైరెక్టర్ గొల్ల రాజన్న, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, అశోక్, గంగాధర్, పెంటన్న, ఎక్బాల్, లతీఫ్, బషీర్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఆగస్టు 6 : మండల కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలో యువచైతన్య యువజన సంఘం నాయకులు నివాళులర్పిం చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు చిల్కూరి శరత్కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.