
కుభీర్, నవంబర్ 5 : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం మని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాల్లో శుక్రవారం ‘మేరా’ వేడుకల్లో జడ్పీటీసీ అల్కాతాయి చౌహాన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గిరిజనులు గోమాతకు పూజలు, పేడతో దీపెంతలు చేసి వెలిగించడం, పూలతో అలంకరణ, దేవీ పూజలు ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలకు మేరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో ముచ్చటించి పండుగ విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం దావూజీ నాయక్ తండాలో సర్పంచ్ శంకర్ జాదవ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్‌తో కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. యువకులకు క్రికెట్ కిట్ అందజేశారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ..
మండలంలోని పార్గీ(బీ)లో రూ.10 లక్షలు, రామునాయక్ తండాలో రూ.6 లక్షలు, పల్సిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూం లక్ష్మి, ఎంపీడీవో రమేశ్, ఎస్ఐ గంగారాం, సర్పంచ్‌లు తూం పుష్పలత, శంకర్ జాదవ్, శ్రీరాముల కవిత రాజేశ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, పార్టీ మండల కన్వీనర్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కందుర్ సంతోష్, ఎస్సీ సెల్ కన్వీనర్ గాడేకర్ రమేశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ దొంతుల రాములు, మాజీ సర్పంచ్ గోరేకర్ బాబు, తోట రాజలింగు, డాక్టర్ రాజన్న, మాజీ ఎంపీటీసీ తోకల రాములు, జేపీఎస్‌లు కమల్‌సింగ్, శివానంద్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.