
యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 5: సీహెచ్పీలు, హెచ్ఈఎంఎం యంత్రాల పని తీరుపై సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు శుక్రవారం అన్ని ఏరియా జీఎంలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. సీహెచ్పీల ఆధునీకరణ, పనితీరు, వేగవంతమైన బొగ్గు రవాణా, నాణ్యతా ప్రమాణాల తదితర విషయాలపై ఏరియా జీఎంలతో డైరెక్టర్స్ సుదీర్ఘంగా చర్చించారు. యంత్రాలు పనితీరు, మరమ్మతు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భారీ యంత్రాల మరమ్మతు విషయంలో అజాగ్రత వహించవద్దని పేర్కొన్నారు. అనంతరం అర్జీ-2 జీఎం టీ. వెంకటేశ్వర్రావు సీహెచ్పీలో నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులు, కొత్త సైలో బంకర్ నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నాణ్యమైన బొగ్గు, కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్లకు వివరించారు. వీసీలో ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య, ఓసీపీ-3 పీవో జీ మోహన్ రెడ్డి, ఏరియా ఇంజినీర్ దుర్గాప్రసాద్, సివిల్ డీజీఎం ధనుంజయ, డీజీఎం(ఐఈడీ) మురళీకృష్ణ, సీహెచ్పీ ఎస్ఈ సదానందం తదితరులు పాల్గొన్నారు.