
ఆకట్టుకున్న గుస్సాడీ నృత్యాలు
ఏత్మాసూర్పేన్, మైసమాల్ దేవతలకు సంప్రదాయ పూజలు
గూడేనికి రూ. 10 వేల చొప్పున అందజేసిన ప్రజాప్రతినిధులు
సర్కారు సాయంపై ఆదివాసుల హర్షాతిరేకాలు
ఉట్నూర్ రూరల్/ ఇంద్రవెల్లి/ ఆదిలాబాద్‌రూరల్/ జైనూర్, నవంబర్ 5;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన గూడేల్లో గురు, శుక్రవారాల్లో దండారీ ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆయా చోట్ల గుస్సాడీ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల హోరుతో పల్లెలన్నీ మార్మోగాయి. వేడుకలకు సర్కారు అందించిన సాయాన్ని ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు అందజేశారు. ఉట్నూర్ మండలంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్, ఇంద్రవెల్లి మండలంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్, ఆదిలాబాద్ మండలంలో ఎమ్మెల్యే జోగు రామన్న, జైనూర్ మండలంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పాల్గొన్నారు.
దండారీ వేడుకల్లో ఎమ్మెల్యే జోగు..
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 5 : మండలంలోని గిరిజన గ్రామాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. పలు చోట్ల గుస్సాడీ నృత్యం చేయడంతో పాటు డప్పువాయిద్యాన్ని వాయించారు. అనంతరం ఆయా గ్రామాల్లో దండారీ నిర్వాహకులకు రూ.10వేల చొప్పున చెక్కులను పంపిణీ చే శారు. కార్యక్రమంలో నాయకులు సెవ్వ జగదీష్, జంగుపటేల్, సోనేరావ్, రమణ, నైతం శుక్లాల్ తదితరులు పాల్గొన్నారు.
పిట్టబొంగురంలో ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్..
ఇంద్రవెల్లి, నవంబర్ 5 : మండలంలోని పట్టబొంగురం గ్రామంలో దండారీ ఉత్సవాల్లో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండారీ నిర్వాహకులకు రూ.10వేలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ వెట్టి రాజేశ్వర్పటేల్, ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీంరావ్, ఉట్నూర్ సీఐ సైదారావ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మత్తడిగూడలో జడ్పీచైర్మన్..
ఉట్నూర్ రూరల్, నవంబర్ 5 : మండలంలోని మత్తడిగూడలో గురువారం దండారీ వేడుకలకు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్ హాజరయ్యారు. వీరిగి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వాహకులకు రూ.10వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో పీసా చట్టం కోఆర్డినేటర్ వసంత్‌రావు, టీఆర్ఎస్ నాయకులు మర్సుకోల తిరుపతి, అర్కిల్ల అశోక్, దావుల రమేశ్, జాదవ్ సుమన్ బాయి, గ్రామ పటేల్ సిడాం సోనేరావు, లచ్చు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో రేఖానాయక్..
మండలంలోని కొలాంగూడ, దుర్గాపూర్, తుకారాంగూడ, దంతన్‌పల్లి, నర్సాపూర్(బీ) గ్రామాల్లో గురువారం దండారీ ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రషీద్, ఎంపీటీసీ కోరెంగ రాణి, రైతుబంధు సమితి మండలాధ్యక్షడు అజీమొద్దీన్, సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షడు కందుకూరి రమేశ్, పట్టణాధ్యక్షుడు సాడిగే రాజ్‌కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.