
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలతో సహా 180 మంది చేరిక
ఖానాపూర్‌రూరల్, జూలై 4 : నిర్మల్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అధ్యక్షతన ఖానాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. ఖానాపూర్ జడ్పీటీసీ ఆకుల రాజమణి వెంకాగౌడ్, ఎంపీపీ మొహి ద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, గాజుల గంగన్న, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తమ అనుచరులు 180 మందితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, కొక్కుల ప్రదీప్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజగంగన్న, ప్రధాన కార్యదర్శి తూము చరణ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్లెలు ప్రగతి పథంలో నడువాలి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
ఖానాపూర్ రూరల్, జూలై 4 : తెలంగాణ ప్రభుత్వంలోనే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని దిలావర్పూర్ గ్రామం లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, సర్పంచ్ మిర్యాల హరిత ప్రతాప్ రావుతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తున్నాయని తెలిపారు. గ్రామాలను పల్లె ప్రగతిలో పచ్చలహారంగా, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. పేదల కోసం 40 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంబాల రాజన్న, నాయకులు వెంకటేశ్, సల్ల మల్లేశ్, నబిఖాన్, శ్రీనివాస్, రవి, కారోబార్ పోశెట్టి, కార్యదర్శి మమత, ఒరగంటి శ్రీనివాస్, కిషన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.