
నార్నూర్, డిసెంబర్ 3 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని గాదిగూడ పీహెచ్సీ హెచ్‌ఈవో పవార్ రవీందర్ అన్నారు. గాదిగూడ మండలం మారేగావ్ గ్రామంలో శుక్రవారం వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తిరిగి టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి డోసు టీకా వేయించుకున్న వారు నిర్ణీత సమయంలోనే రెండో డోసు టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది నిర్మలాబాయి, అంజన్నబాయి పాల్గొన్నారు.
టాకిగూడలో..
గుడిహత్నూర్, డిసెంబర్ 3 : మండలంలోని టాకిగూడ గ్రామంలో వైద్యసిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు లక్ష్మణ్, రాంకిషన్ పటేల్, మోతీరాం, ఉత్తమ్, మనోజ్, పాండు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ వ్యాక్సినేషన్
బేల, డిసెంబర్ 3: మండల కేంద్రంతో పాటు దహీగాం, పాఠన్ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అంబుతాయి, ఫైజుల్లా ఖాన్ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్, డిసెంబర్ 3: ఒమిక్రాన్ వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్నూర్ ఆరోగ్య సీహెచ్‌సీ పర్యవేక్షకుడు చౌహాన్ చరణ్‌దాస్ అన్నారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలోని ఎస్సీగూడ వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేశారు. 32 మందికి టీకా వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కైలాస్, అనిత, సంగీత, శ్రీలత పాల్గొన్నారు.