
ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత
న్యాయవాదులు, పీపీలతో సమావేశం
ఎదులాపురం, డిసెంబర్ 3 : జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సమావేశ మందిరంలో శుక్రవారం న్యాయవాదులు, పీపీలతో సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో రాజీతో పరిష్కారమయ్యే కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునిత మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజలు సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతో పాటు కేసులను త్వరతగతిన పరిష్కరించేందుకు జాతీయలోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు క్షమాదేశ్ పాం డే, వై జయప్రసాద్‌రావు, టీ శ్రీనివాస్‌రావు, పీపీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.