
నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి పలు మండలాల్లో పర్యటన
నిర్మల్ టౌన్, డిసెంబర్ 3 : నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించి సెగ్రిగేషన్ షెడ్డులో తడి, పొడి చెత్తతో ఎరువుల తయారీకి ప్రణాళికలు రూపొందించుకోవాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. జిల్లాలోని నర్సాపూర్(జీ), లక్ష్మణచాంద, మామ డ మండలాల్లోని సెగ్రిగేషన్ షెడ్లను శుక్రవారం పరిశీలించారు. హరితహారంలో భాగంగా వచ్చే ఏడాది మొక్కలు నాటేందుకు బ్యాగ్ ఫిల్లింగ్ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నర్సరీల పరిశీలన
కుంటాల, డిసెంబర్, 3: మండలంలోని కల్లూర్, అందకూర్లోని నర్సరీలను డీఆర్డీవో కే విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. వివిధ రకాల మొక్కలు పెంచేందుకు అవసరమయ్యే విత్తనాలను తీసుకొచ్చి నాటాలని సిబ్బందికి సూచించారు. కల్లూర్, కుంటాల రహదారిపై గత హరితహరంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని, నీరు పోసి సంరక్షించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఏపీవో నవీన్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.