
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 3: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మహిళలు చేతి పనులు నేర్చుకుంటే కుటుంబాలకు అండగా నిలవచ్చని అభిప్రాయపడ్డారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా అందిస్తున్న శిక్షణ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణలో భాగంగా ఇచ్చే సర్టిఫికెట్లతో రుణ సదుపాయం పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మణ్, బండారి దేవన్న, తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ పరిశీలన
పట్టణంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. సుభాష్‌నగర్‌లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించారు. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ పని తీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు టీకాలు తీసుకోని వారికి వ్యాక్సిన్ వేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచనలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మణ్, సామాజికవేత బండారి దేవన్న, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.