
అర్హులందరికీ పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిలావర్పూర్, సారంగాపూర్‌లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
దిలావర్పూర్, నవంబర్ 3 : త్వరలోనే అర్హులందరికీ సొంతింటి కలను నెరవేరుస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దిలావర్పూర్ తహసీల్ కార్యాలయంలో నర్సాపూర్(జీ), దిలావర్పూర్ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ సొంతం ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్లను ని ర్మించి ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పిం ఛన్లు, రైతులకు రుణమాఫీ వంటి హామీలను త్వరలోనే అమలు చేస్తున్నామన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు. సర్పంచ్ వీరేశ్‌కుమార్, తహసీల్దార్ హిమబిందు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ బాబురావు, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి,రైతుబందు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, ఎంపీటీసీలు పాల్దే అక్షర అనిల్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, సర్పంచ్‌లు రాం రెడ్డి, శ్రీనివాస్, ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు.
సారంగాపూర్‌లో..
సారంగాపూర్, నవంబర్ 3: మండలంలోని కౌట్ల(బీ)లోని కరుణాకర్‌రెడ్డి ఫంక్షన్హాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అడెల్లి ఆలయాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, అడెల్లి-బోథ్ రోడ్డు నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పొట్యా గ్రామపంచాయతీకి సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్‌డ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, వైస్ ఎంపీపీ పతాని రాధ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ మధూకర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, మార్కెట్ వైస్ చైర్మన్ మల్లయ్య పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం
నిర్మల్ అర్బన్, నవంబర్ 3 : ఇటీవల నూతనంగా నిర్మల్ పట్టణ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన మారుగొండ రాముతో కలిసి పలువురు పార్టీ నాయకులు బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు. ఆయనను స న్మానించారు. పార్టీలో కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, నాయకులు ధర్మాజీ శ్రీనివాస్, పోశెట్టి, రామకృష్ణ, పద్మాకర్, గండ్రత్ రమేశ్ ,మంగార్లరపు పోశెట్టి ఉన్నారు. అ నంతరం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్‌ను నూతనంగా ఎన్నికైన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
రైతు విభాగాన్ని పటిష్ట పర్చాలి
నిర్మల్ టౌన్, నవంబర్ 3 : రైతు విభాగాన్ని పటిష్టం చేస్తూ రైతు సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలని మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. ఇటీవల టీఆర్ఎస్ అనుబంధ కమిటీలను ఎన్నుకోగా.. నిర్మల్ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన రైతు బం ధు కమిటీ అర్బన్ కన్వీనర్ ధర్మాజీ శ్రీనివాస్‌ను పట్టణ రైతు విభాగం కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఆయన మర్యాదపూర్వకంగా మంత్రిని కలి సి పుష్పగుచ్ఛం అందించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు పాల్గొన్నారు. అనంతరం సోన్‌లో 36 మందికి దివ్య గార్డెన్లో షాదీ ము బారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.