
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
తానూర్, అక్టోబర్ 3: సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాశెట్టి సాగరబాయి, ఎంపీపీ మంజుల, వైస్ ఎంపీపీ చంద్రకాంత్, సొసైటీ చైర్మన్ నారాయణ్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతారెడ్డి, తానూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, విఠల్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, ఐకేపీ ఏపీఎం సులోచన, టీఆర్ఎస్ నాయకులు చంద్రకాంత్ యాద వ్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కుభీర్, అక్టోబర్ 3 : కుభీర్‌లో ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఐకేపీ కార్యాలయ మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడిపాడి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, సింగిల్ విండో చైర్మన్ గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ దొంతుల రాములు, మండల సమాఖ్య అధ్యక్షురాలు మాల్వే లత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్, ఎంపీటీసీ పోసానిబాయి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముథోల్, అక్టోబర్ 3 : ముథోల్‌లోని ఐకేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. మండలానికి దాదాపు 13 వేలకు పైగా చీరెలు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్,రాంరెడ్డి, కోఆప్షన్ మెంబర్ మగ్దూ మ్, నాయకులు పోతన్న యాదవ్, రమేశ్, సంతోష్, రవి, ఎంపీడీవో సురేశ్ బాబు, ఏపీఎం అశోక్, మహిళలు పాల్గొన్నారు.
కుంటాల, అక్టోబర్, 3 : కుంటాల మండల కేంద్రంలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. మండలానికి 8,995 చీరెలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు..
వరికోత యంత్రాలు అందజేత
మండల కేంద్రంలో రూర్బన్ పథకం ద్వారా మంజూరైన వరి కోత యంత్రాలను మహిళా సంఘాలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక రాయితీలు అందిస్తున్నదని చెప్పారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఏపీఎం భోజన్న, ఎల్ఎస్ఎంఎస్ అధ్యక్షురాలు గోనె లక్ష్మి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, గ్రామ కమిటీల అధ్యక్షులు ఓడ్నం రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ భోజన్న, సబ్బిడి గజేందర్, ఆత్మ డైరెక్టర్లు భూమన్న, దశరథ్, జాగృతి కన్వీనర్ బోగ లక్ష్మణ్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఓ అనిల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జీ ప్రకాశ్ గౌడ్, జే మహేందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.