
ఖాందేవ్ ప్రతిమలను తీసుకొచ్చేందుకు పయనం
నార్నూర్, జనవరి 3 : ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో తయారుచేసిన ఖాందేవ్ ప్రతిమలను తీసుకువచ్చేందుకు నార్నూర్ మండలం బాబేఝరి పంచాయతీ పరిధిలోని చిత్తగూడ నుంచి మెస్రం వంశీయులు పయనమయ్యారు. సోమవారం కాలినకడన, ఎడ్లబండ్లపై వాయిద్యాలతో బయల్దేరారు. ఈ సందర్భంగా అక్కడ సం ప్రదాయ పూజలు చేశారు. తొడసం నాగోరావ్, కటోడా తొడసం బాపురావ్ మాట్లాడారు. కెస్లాపూర్‌లో గ్రానైట్‌తో తయారుచేసిన ఖాందేవ్ ప్ర తిమలను తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 17వ తేదీన నార్నూర్‌లోని ఖాందేవ్ పుణ్యక్షేత్రంలో జాతర ప్రారంభమవుతుందని తెలిపా రు. అదే రోజు ఆలయంలో సంప్రదాయ పూజ లు చేసి, ఖాందేవ్ ప్రతిమను ప్రతిష్ఠిస్తామని చె ప్పారు. 18న ఆ వంశ ఆడపడుచు, తొడసం సో నేరావ్-జంగుబాయి దంపతుల కుమార్తె మడా వి ఏత్మాబాయి తైలం తాగుతారని పేర్కొన్నారు. మెస్రం రూప్దేవ్పటేల్, తొడసం గోపాల్, తొడసం రాజు, సార్మేడి మడావి తుకారాం, తెలంగ్రావ్, నారింజి పటేల్, బాదిపటేల్, యాదవ్షావ్, భీంరావ్ పటేల్ పాల్గొన్నారు.