
నిర్మల్ టౌన్, జనవరి 3 : నిర్మల్ జిల్లా అభి వృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ను సోమవారం వేర్వేరుగా కలిశా రు. పుష్పగుచ్ఛం అందించి కొత్త సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారూ నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఉద్యోగులు కష్టపడి పని చేయాల న్నా రు. వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నీటిపారుదల శాఖ ఈఈ రామారావు, అధికా రులు మస్తాన్‌రావు, మైనార్టీ సంక్షేమశాఖ అధికా రి స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు, బీసీ కార్యాలయ ఉద్యోగులు సృజయ్, భూగర్భ జల శాఖాధికారి శ్రీనివాస్‌బాబు పాల్గొన్నారు.