
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 3 : జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఎంపీ సోయం బాపురావ్, బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన జోగు ప్రేమేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా ల యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమా వేశం లో ఆయన మాట్లాడారు. సీసీఐ ఫ్యాక్టరీని పునరు ద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మం త్రి కేటీఆర్ కేంద్రమంత్రులకు లేఖ రాశారని గుర్తు చేశారు. సీసీఐలో ఫ్యాక్టరీని మరో 20ఏళ్ల పాటు నిర్వహించడానికి అన్ని వసతులు ఉన్నాయన్నా రు. గతంలో సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి ఫ్యాక్ట రీని తెరవాలని కోరారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ, నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్యాక్టరీని ప్రారంభించేలా చూడాలన్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వ ర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, ప్రకాశ్, సంద నర్సింగ్, దమ్మపాల్ పాల్గొన్నారు.
ప్రథమ స్థానంలో నిలపాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో ఆదిలాబాద్ మున్సి పాలిటీని ప్రథమ స్థానంలో నిలపాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తాచెదా రాన్ని డంప్యార్డులకు తరలించాలన్నారు. ప్రజ లు స్వచ్ఛత పాటిస్తూ వారికిచ్చిన బుట్టల్లోనే చెత్త ను వేస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించా లన్నారు. పలు అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ, కోఆ ప్షన్ సభ్యుడు సత్యనారాయణ, నాయకులు పండ్ల శ్రీనివాస్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.